Kota Srinivasa Rao: నటనకు పెట్టని ‘కోట’.. నవరసాల కంచు ‘కోట’ సినీ కెరీర్ లో కీలక ఘట్టాలు..

Kota Srinivasa Rao No More News

Kota Srinivasa Rao: నటనకు పెట్టని ‘కోట’.. నవరసాల కంచు ‘కోట’ సినీ కెరీర్ లో కీలక ఘట్టాలు..
Kota Srinivasa Rao DiedKota Srinivasa Rao Passes AwayKota Srinivasa Rao Passed Away
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 278 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Kota Srinivasa Rao Passes Away: తెలుగు సినిమా చరిత్రలో కొద్ది మంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు.

Kota Srinivasa Rao Passes Away : తెలుగు సినిమా చరిత్రలో కొద్ది మంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు. తెలుగులో ఫేమస్ విలన్స్ అంటే ముందుగా రాజనాల, నాగభూషణం, సత్యనారాయణ , రావు గోపాల రావు తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు కోట శ్రీనివాస రావు ఒకరు.

ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన సినీ ప్రస్థానంపై జీ తెలుగు న్యూస్ ఫోకస్..Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..Nokia Magic Max 5G: Nokia నుంచి దిమ్మతిరిగే మొబైల్.. అబ్బబ్బ ఫీచర్స్ బలే ఉన్నాయి.. లీకైన పూర్తి వివరాలు ఇవే.. Kota Srinivasa Rao Passed Away: కళ్లలో క్రూరత్వాన్ని నింపుకొని విలనిజం పండించగలగడం.. అలాగే తనదైన కామెడి టైమింగ్ తో ఆడియన్స్ ను గిలిగింతలు పెట్టాడు.అంతేనా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నీళ్లు పెట్టించిన అతికొద్ది నటుల్లో పద్మశ్రీ కోట శ్రీనివాస రావు ఒకరు. తెరపై నవరసాలు పోషించి మెప్పించిన అరుదైన ఘనత కోట సొంతం. పాత్ర ఏదైనా దాన్ని ఓన్ చేసుకొని నటించడంలో కోట శ్రీనివాస రావుది ప్రత్యేక శైలి...సినిమా సినిమాకి తన యాక్టింగ్ స్కిల్క్స్ తో ప్రేక్షకులను మైమరిపించారు. అంతేకాదు తెలుగులో అన్ని మాండలికాల్లో డైలాగ్స్ చెప్పి మెప్పించగల నటుడు కోట శ్రీనివాస రావు. కోట.. కొన్ని పాత్రలకు పెట్టని కోటలాంటి వాడు. కేరెక్టర్ ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం అన్నది కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అలాంటి అరుదైన నటులలో శ్రీనివాసరావుకు తప్పక స్థానం దక్కుతుంది. ఎన్నో సినిమాల్లో తన పాత్రలతో జీవం పోసిన కోట శ్రీనివాస రావు.. 1942 జూలై 10 న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో అనేక నాటకాలు ప్రదర్శించాడు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసాడు కోట శ్రీనివాస. రంగస్థలంపై 20 యేళ్ల సుధీర్ఘ అనుభవం ఆయన సొంతం. అలా ఒకసారి ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేసింది కోట బృందం. ఆ ప్లే చూసిన దర్శక నిర్మాత క్రాంతికుమార్ ప్రేరణ చెంది దాన్ని సినిమాగా తీసాడు. ఆ నాటకంలో నటించిన నటీనటులందరికీ సినిమాలో అవకాశం ఇచ్చారు క్రాంతికుమార్. ఈ విధంగా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. నటుడిగా చిరంజీవి కనిపించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అప్పటి వరకు సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట.. 1986 వరకూ సినిమాలను అసలు సీరియస్ గా తీసుకుందే లేదు.ఇక పర్సనల్ విషయానికొస్తే.. 1968లో రుక్ష్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌ 2010 జూన్‌ 21న రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీంతో ఆయన తీవ్రంగా కృంగిపోయారు. నటుడిగా కోట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ‘ప్రతిఘటన’. టి.కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో కోట .. కాశయ్యగా తెలంగాణ మాండలికంలో పండించిన నటన ఆయనకు బాగా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో చేసిన రేపటిపౌరులు కూడా కోటలోని విలనిజాన్ని సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ సినిమా నటుడిగా కోటలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సినిమా ‘అహనా పెళ్లంట. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో.. కోట పిసినారి లక్ష్మీ పతిగా పండించిన నటన ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ‘ఒరేయ్ అరగుండు వెధవా’ అంటూ బ్రహ్మానందాన్ని తిట్టే సన్నివేశాలు, ముఖ్యంగా ‘నాకేంటి...మరి నాకేంటి..’ అని కోటనోట పలికే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి.ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సీన్స్ చూసే ప్రేక్షకులున్నారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల సినిమాల్లో కోటకు ప్రత్యేక పాత్ర ఉండి తీరాల్సిందే. కోటతో హాస్యబ్రహ్మా అనేక వేషాలు వేయించాడు. జయమ్ము నిశ్చయమ్మురా...లో సినిమా కథలను చెప్పి అవతలి వాళ్లను తికమక పెట్టే సీన్లు ప్రేక్షకులను హాయిగా నవ్విస్తాయి. ప్రతినాయకుడిగా.. కోట శ్రీనివాసరావు నటనకు తిరుగు లేదు. ఎన్నో చిత్రాల్లో ‘కోటమార్కు’ విలనిజం అద్భుతంగా పండించిన ఘనత శ్రీనివాసరావుది. కొన్ని సినిమాలను ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చిన ఘనుడు కోట. ఆయన నటించిన శివ, శత్రువు, బొబ్బిలిరాజా, గణేష్, గాయం, ఆమె.. చిత్రాల్లో విలన్ గా నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా గాయంలో గురు నారాయణగా కోట పండించిన నటన అందరినీ ఆకట్టుకుంది. ప్రతినాయకుడిగా హీరోలకు ధీటుగా నటించి అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడాయన. శివ చిత్రం పేరు చెప్పగానే మాచిరాజు గుర్తుకు వస్తాడు. గణేష్ చిత్రంలో ‘సాంబశివుడి’గా .. మనీలో ‘అల్లాదీన్’గా ..మామగారులో పోతురాజుగా.. హలో బ్రదర్ లో ‘తాటి మట్టయ్యగా.. ఈయన నటనను మరిచిపోలేము. విలన్ గానే కాకుంగా కామెడీ విలన్ గా సైతం కోట పండించిన నటన ఎందరో నటులకు స్పూర్తిగా నిలిచింది. గురువు జంధ్యాల స్ఫూర్తి వల్ల కావచ్చు.. ఇవివి సత్యనారాయణ చిత్రాల్లో కోటకు ప్రత్యేక స్థానం ఉండాల్సిందే. హలో బ్రదర్, జంబలకిడి పంబ, ఏవండీ ఆవిడొచ్చింది.. లాంటి చిత్రాలు నటుడిగా కోటను మరో మెట్టు ఎక్కేలా చేసాయి. జంబలకిడి పంబలో కోట పలికే ‘వీడెడ్రరా బాబు... ’అంటూ పలికే డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. నటుడిగా కామెడీ, విలనిజమే పండిచడమే కాడు. అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు కోట. ముఖ్యంగా సహాయ నటుడిగా అనేక పాత్రలో నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చాడు. క్యారెక్టర్ నటుడిగా ఆయన పండించినంత నటన నేటి జనరేషన్ లో మరెవరికి సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. ఆడవారికి అర్ధాలే వేరులే, దమ్ము, గబ్బర్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు లెక్కే ఉండదు. ఒకటా రెండా ఎన్నో వందల చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. దాదాపు 750 చిత్రాల్లో ప్రేక్షకులతో తన నటన వల్ల వీడేండి ఇలా చేసాడని ఆడవాళ్లతో తిట్టించుకోవడమే కాదు.. తన నవ్వులతో ఆడియన్స్ మెప్పులు పొందిన నటుడు. ఇలా ఒకదాని కొకటి సంబంధం లేని పాత్రల్లో నటించి ఆల్ రౌండర్ గా నిలిచాడు కోట శ్రీనివాసరావు. అంతేకాదు రాజకీయాల్లో సత్తా చాటారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంతలోనే ఈయన మృతి చెందడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయిందనే చెప్పాలి. పెళ్లి తర్వాత కూడా ఆ తెలుగు స్టార్ హీరోయిన్ తో కొనసాగిన గంగూలి ఎఫైర్ .. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన స్టార్ క్రికెటర్ లవ్వాయణం..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral Video: ఒలింపిక్స్ వెళ్తే కప్ కొట్టడం పక్కా.!.. భర్తను చూసి ఓయో నుంచి మహిళ ఎంత ఫాస్ట్ గా గోడలు దూకేసిందో ..?.. వీడియో వైరల్..Viral Video: ఇంత వైలెంట్‌గా ఉందేంటీ భయ్యా.. సెల్పీ దిగుదామని చెప్పి కృష్ణానదిలో భర్తను తోసేసిన భార్య.. వీడియో ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kota Srinivasa Rao Died Kota Srinivasa Rao Passes Away Kota Srinivasa Rao Passed Away Kota Srinivasa Rao Cine Career Tollywood

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Revanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగంRevanth Reddy: గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రసంగంRevanth Reddy Hot Comments In Gaddar Film Awards: అట్టహాసంగా జరిగిన గద్దర్‌ అవార్డుల వేడుకలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. సినీ పరిశ్రమను ఆదుకుంటామని.. అన్ని చూసుకుంటామని ప్రకటించారు. సినీ పరిశ్రమపై కఠినంగా ఉన్నా అభిమానంగా చూసుకుంటామని తెలిపారు.
Read more »

AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?Top 10 Engineering Colleges in AP: ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలను జాయిన్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ పేర్కొన్న లిస్టులో ఏపీలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. NIRF యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇవి టాప్ లో నిలిచాయి.
Read more »

ENG VS IND: లీడ్స్‌లో 5 సెంచరీలు వృధా.. దుమ్మురేపిన బెన్ డకెట్..తొలి టెస్టులో భారత్‎ ఓటమి..!!ENG VS IND: లీడ్స్‌లో 5 సెంచరీలు వృధా.. దుమ్మురేపిన బెన్ డకెట్..తొలి టెస్టులో భారత్‎ ఓటమి..!!ENG VS IND: లీడ్స్ టెస్ట్ లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. తొలి టెస్ట్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
Read more »

Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao Passes Away: ప్రముఖ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. యాక్టర్‌, రాజకీయ నేతగా కూడా పనిచేసిన ఈయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more »

Actor Kota Sreenivasa Rao passes away: നടൻ കോട്ട ശ്രീനിവാസ റാവു അന്തരിച്ചു; അന്ത്യം 83ാം വയസിൽActor Kota Sreenivasa Rao passes away: നടൻ കോട്ട ശ്രീനിവാസ റാവു അന്തരിച്ചു; അന്ത്യം 83ാം വയസിൽമമ്മൂട്ടി നായകനായി എത്തിയ ദി ട്രെയിൻ ആണ് കോട്ട ശ്രീനിവാസ റാവു അഭിനയിച്ച ഏക മലയാള ചിത്രം.
Read more »

Kota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళిKota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళిKota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళి
Read more »



Render Time: 2026-04-02 15:46:17