Kota Srinivasa Rao No More: దివికేగిన దిగ్గజం.. కోటా శ్రీనివాసరావు మరణంపై ప్రముఖుల నివాళి
Kota Srinivasa Rao Live: దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కోటా మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కోటా శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..టాలీవుడ్ ఇండస్ట్రీ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. విలనిజం పండిస్తూ.. కామెడీతో నవ్విస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కన్నీళ్లు పెట్టిస్తూ.. ఏ పాత్ర చేసిన పరాకాయ ప్రవేశం చేసిన సీనియర్ కోటా శ్రీనివాస్ రావు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోటా.. ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోటా.. తన యాక్టింగ్‌తో ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో సినిమాల్లో తన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన కోటా శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కోటా శ్రీనివాసరావు లేటెస్ట్ న్యూస్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు అని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మరణం బాధాకరమని.. మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, తండ్రిగా, తాతగా, రాజకీయనాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అని కొనియాడారు.కోటా శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త తనను ఎంతో కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వందల కొద్దీ సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన…పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు మరణంపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి.. ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు అని అన్నారు. ఆయన మరణంతో సినీ రంగం గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు. కోటా శ్రీనివాస రావు ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కోటా శ్రీనివాసరావు మరణంపై ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు.కోట శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చలన చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన…"తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష... యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు. కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోట గారు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించాము. శ్రీ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కోట శ్రీనివాసరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.." అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.Viral Video: ఒలింపిక్స్ వెళ్తే కప్ కొట్టడం పక్కా.!.. భర్తను చూసి ఓయో నుంచి మహిళ ఎంత ఫాస్ట్ గా గోడలు దూకేసిందో ..?.. వీడియో వైరల్..Viral Video: ఇంత వైలెంట్‌గా ఉందేంటీ భయ్యా.. సెల్పీ దిగుదామని చెప్పి కృష్ణానదిలో భర్తను తోసేసిన భార్య.. వీడియో ..Rangaraya Medical College Kakinada Medical College: 50 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు.. ఏమన్నారంటే..?
Actor Kota Srinivasa Rao Kota Srinivasa Rao News Kota Srinivasa Rao No More
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
NEET UG 2025 Chances: నీట్ 2025లో 420లోపు మార్కులకు కన్వీనర్ కోటా సీటు వస్తుందా రాదా చెక్ చేసుకోండిNEET UG 2025 Seat Allottment details marks category wise in ap and telangana నీట్ ఆల్ ఇండియా, స్టేట్ కౌన్సిలింగ్ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. నీట్ 2025 స్కోర్ 420 మార్కులు వస్తే సీటు వస్తుందా లేదా అని చూస్తున్నారు
Read more »
IPL टिकट घोटाला- हैदराबाद क्रिकेट एसोसिएशन के अध्यक्ष जगनमोहन गिरफ्तार: SRH को ब्लैकमेल करने का आरोप; BCCI ...HCA president Jagan Mohan Rao arrested in IPL ticket scam dainik bhaskar updates
Read more »
Maalik Prediction: बॉक्स ऑफिस का 'मालिक' बनने को तैयार Rajkummar Rao, पहले दिन छापेगी इतने करोड़?Maalik Collection Prediction अभिनेता राजकुमार राव Rajkummar Rao बॉक्स ऑफिस के नए किंग बन गए हैं। बीता समय उनके लिए काफी शानदार गुजरा है। अब उनकी अगली फिल्म मालिक कल रिलीज होने जा रही है। आइए जानते हैं कि इसे कमाई के मामले में किस तरह का ओपनिंग मिल सकती...
Read more »
Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao Passes Away: ప్రముఖ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. యాక్టర్, రాజకీయ నేతగా కూడా పనిచేసిన ఈయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more »
इंडस्ट्री में फिर पसरा मातम, इस दिग्गज सितारे ने तोड़ा दम, 750 से ज्यादा फिल्मों में किया काम, राजनीति में भी था बड़ा नामKota Srinivasa Rao Death: साउथ सिनेमा की कई हिट फिल्मों में अपने दमदार अभिनय से लोगों के दिलों में अपनी जगह बनाने वाले दिग्गज एक्टर कोटा श्रीनिवास राव का निधन हो गया है. इस खबर से पूरी फिल्म इंडस्ट्री गम का मातम पसर गया है.
Read more »
Actor Kota Sreenivasa Rao passes away: നടൻ കോട്ട ശ്രീനിവാസ റാവു അന്തരിച്ചു; അന്ത്യം 83ാം വയസിൽമമ്മൂട്ടി നായകനായി എത്തിയ ദി ട്രെയിൻ ആണ് കോട്ട ശ്രീനിവാസ റാവു അഭിനയിച്ച ഏക മലയാള ചിത്രം.
Read more »
