India Pakistan War Updates Pakistan struggling with Baloch liberation army attacks India Pakistan War: ఓ వైపు ఇండియాతో యుద్ధంతో పరాభవం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు స్వదేశంలో వేర్పాటువాద ఉద్యమం జటిలమైన సమస్యగా మారింది
India Pakistan War: దాయాది దేశం పాకిస్తాన్‌కు ఇంటా బయటా రెండింటా సమస్యలు తప్పడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో ఇండియాతో యుద్ధం కొని తెచ్చుకున్న పాకిస్తాన్‌కు సొంత దేశంలో వేర్పాటు కుంపటి రాజుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heroine: నీ మూత్రం తాగాలనుంది.!.. టాలీవుడ్ హీరోయిన్‌కు నెటిజన్ షాకింగ్ క్వశ్చన్..!.. నటి రిప్లై ఏంటంటే..? India Pakistan War: ఓ వైపు ఇండియాతో యుద్ధంతో పరాభవం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు స్వదేశంలో వేర్పాటువాద ఉద్యమం జటిలమైన సమస్యగా మారింది. ఉగ్రవాద స్థావరాలపై కాలు దువ్విన కారణంగా అటు ఇండియాతో ఇటు బలోచ్ లిబరేషన్ ఆర్మీతో సమస్యలు ఎదుర్కొంటోంది. జమ్ము కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో ఇండియా చేస్తున్న ద్రోన్ దాడులతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ ఆర్ధికంగా మరింత కుదేలవుతోంది. సరిహద్దుల్లో కాల్పులు, వైమానిక స్థావరాలపై దాడులతో ఆ దేశం బెంబేలెత్తుతోంది. ఇదే అదనుగా ఎప్పట్నించో నివురుగప్పిన నిప్పులా ఉన్న వేర్పాటువాద ఉద్యమం రాజుకుంది. తీవ్రరూపం దాల్చింది. అదే బలోచిస్తాన్ ఉద్యమం. పాకిస్తాన్ ఇండియాను ఎదుర్కొనే క్రమంలో బిజీగా ఉండగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెచ్చిపోయింది. పాకిస్తాన్‌లోని కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని బలోచ్ లిబరేషన్ ఆర్మ ప్రకటించింది. ఇప్పటికే 39 ప్రాంతాలపై దాడులు చేసినట్టు తెలిపింది. తమ దాడులు కొనసాగుతాయని వెల్లడించింది. పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్‌పై కూడా దాడులు చేసింది. ఇండియాతో యుద్ధం జరుగుతుండగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వదేశంలో దాడులకు దిగింది. ఇప్పటికే కొందరు పోలీసులను అదుపులో తీసుకుంది. పోలీస్ స్టేషన్‌ను కూడా నియంత్రణలో తీసుకున్నట్టు ప్రకటించింది. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో మనీ విత్‌డ్రాయల్ ఆంక్షలు కూడా ఉన్నాయి. మరో వైపు ఇంధన కొరత తీవ్రమైంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్ని తాత్కాలికంగా మూసివేశారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. ఇండియాతో యుద్ధం ఆగినా పాకిస్తాన్‌కు సమస్య తీరేలా లేదు. స్వదేశంలో నెలకొన్న వేర్పాటువాద ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే పరిస్థితి ఉంది. అదే జరిగితే పాకిస్తాన్ మరోసారి చీలిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.INS Vikrant
Baloch Liberation Army Balochistan India Pakistan War India Pakistan War Updates India Pakistan War Situation
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
कश्मीर में सेना का एक्शन, 4 आतंकियों के घर ढहाए: जलशक्ति मंत्री बोले- पाकिस्तान को एक बूंद पानी नहीं देंगे;...Pahalgam Terror Attack, India Pakistan Airforce, India Pakistan Terrorist Action, PM Modi Amit Shah, Jammu Kashmir, India vs Pakistan War, India Pakistan Conflict, Indus Water Treaty, Indian Air Force, BSF, Pahalgam attack
Read more »
पहलगाम आतंकी हमले की जांच NIA करेगी: सुरक्षाबलों ने कश्मीर में 7 आतंकियों के घर धमाके से ढहाए; ईरान राष्ट्र...Pahalgam Terror Attack, India Pakistan Airforce, India Pakistan Terrorist Action, PM Modi Amit Shah, Jammu Kashmir, India vs Pakistan War, India Pakistan Conflict, Indus Water Treaty, Indian Air Force, BSF, Pahalgam attack
Read more »
India Pakistan War: యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, వారం రోజుల్లో చేతులెత్తేస్తుందాJammu Kashmir Pahalgam Terror Attack creates havoc of India Pakistan War India Pakistan War: జమ్ము కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య వైరి వాతావరణం పీక్స్‌కు చేరింది. ఇప్పటికే సరిహద్దులో యుద్ధం వాతావరణం నెలకొంది.
Read more »
India Vs Pakistan: పాక్ తో యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్..India Vs Pakistan: మంగళవారం అర్ధరాత్రి ఉరుములేని పిడుగులా పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో విరుచుకుపడిన భారత దళాలు.. మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది. వాటిలో నాలుగు పాకిస్థాన్‌లో, మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి.
Read more »
India Pakistan War Big Breaking: പാകിസ്താനില് താണ്ഡവമാടി ഇന്ത്യ, മൂന്ന് വ്യോമ കേന്ദ്രങ്ങള് ആക്രമിച്ചു; പാക് വ്യോമപാത അടച്ചുIndia Pakistan War Big Update: India attacks 3 Pakistan Air Bases
Read more »
India Pakistan War: భీకరంగా ఇండియా పాక్ యుద్ధం, ఇండియా ధ్వంసం చేసిన వైమానిక స్థావరాలు ఇవేIndia Pakistan War Live Updates check the 3 most crucial Pakistan Airbases attacked India Pakistan War Day 3 Updates: ఇండియా పాకిస్తాన్ యుద్ధం మూడో రోజు భీకరంగా మారింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి
Read more »
