Know About Paetongtarn Shinawatra: గొప్ప కుటుంబంలో పుట్టినా కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం చేసింది. బేకరీలో పని చేస్తూ ఉన్న ఆమె ఇప్పుడు ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించింది. హీరోయిన్‌ను మించిన అందం ఆమె సొంతం.
గొప్ప కుటుంబంలో పుట్టినా కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం చేసింది. బేకరీలో పని చేస్తూ ఉన్న ఆమె ఇప్పుడు ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించింది. హీరోయిన్‌ను మించిన అందం ఆమె సొంతం.
38 ఏళ్లకే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన పేటోంగ్‌టార్న్ షినవత్రా గురించి తెలుసుకుందాం. ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీని అక్కడి ప్రధానమంత్రి పటోంగ్‌టార్న్ షినవత్రా ఘన స్వాగతం లభించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ప్రధాని మోదీని స్వాగతం పలికిన ఆమె ఎవరు? అనే చర్చ జరుగుతుండడంతో ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.థాయిలాండ్‌లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రిగా పేటోంగ్‌టార్న్ షినవత్రా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రభావవంతమైన షినవత్ర రాజవంశానికి చెందిన వారసురాలు ఆమె. ఆ పదవిని అధిష్టించిన అతి పిన్న వయస్కురాలిగా అరుదైన ఘనత సాధించారు.నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని పేర్కొంటూ న్యాయస్థానం ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించిన తర్వాత షినవత్ర తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనూహ్యంగా ఆమె పేరు తెరపైకి రావడం.. అనంతరం బాధ్యతలు చేపట్టడం మొత్తం చకాచకా జరిగిపోయాయి.థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పటోంగ్‌టార్న్ షినవత్రా వయసు 38 ఏళ్లు మాత్రమే. ఆమె ఆ దేశానికి రెండో మహిళా ప్రధానమంత్రి. ఆమె కుటుంబంలో ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు. ఆమె తండ్రి మాజీ ప్రధాన మంత్రి తక్సిన్ షినవత్రా. 2001 నుంచి 2006 వరకు పదవిలో ఉన్నారు. సైనిక తిరుగుబాటు తర్వాత ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన థాయిలాండ్‌లోనే అత్యంత ధనవంతుడు.షినవ్రత 15 ఏళ్ల పాటు విదేశాల్లో విద్యాభ్యాసం.. ఇతర వాటితో బిజీగా ఉన్నారు. గతేడాది థాయిలాండ్‌కు తిరిగి వచ్చి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఇప్పుడు థాయ్ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పటోంగ్‌టార్న్ థాయిలాండ్‌లోని ప్రతిష్టాత్మక చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం యూకేకి వెళ్లారు. సర్రే విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ హోటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 17 సంవత్సరాల వయసులో ఆమె మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసింది. ఆ వార్త అప్పట్లో సంచలనం రేపింది.
Thailand Part Time Job Mcdonalds Singapore Narendra Modi Bimstec Meeting
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
બ્લેકસ્ટોને આ કંપનીમાં ખરીદ્યો 40% હિસ્સો, 2 અઠવાડિયામાં શેરના ભાવમાં 38%નો વધારોBuy Stake: વિશ્વની અગ્રણી રોકાણ કંપની બ્લેકસ્ટોને ભારતીય રિયલ એસ્ટેટ કંપનીમાં 40 ટકા હિસ્સો ખરીદ્યો છે. એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સોદો 1167.03 કરોડ રૂપિયામાં થયો છે.
Read more »
Heat Wave Alert: 38 ഡിഗ്രി സെൽഷ്യസ് വരെ താപനില ഉയരും; ഏഴ് ജില്ലകളിൽ യെല്ലോ അലർട്ട്വിവിധ ജില്ലകളിൽ കേന്ദ്ര കാലാവസ്ഥാ വകുപ്പ് ഉയർന്ന താപനില മുന്നറിയിപ്പ് നൽകി | Heat Wave Alert Temperatures will rise to 38 degrees Celsius Yellow alert in seven districts
Read more »
Gorakhpur Film Festival: गोरखपुर में अंतरराष्ट्रीय धार्मिक-आध्यात्मिक फिल्म महोत्सव, 38 फिल्म होगी शामिलगोरखपुर में 20-22 मार्च को 'धार्मिक और आध्यात्मिक अंतरराष्ट्रीय फिल्म महोत्सव' होगा. इसमें 38 फिल्में दिखाई जाएंगी. उद्घाटन में विवेक अग्निहोत्री और रवि किशन होंगे.
Read more »
ગરમીનું કાતિલ ટોર્ચર, દેશ સહિત ગુજરાતના અનેક શહેરો ગરમીની ઝપેટમાં; નવા રિપોર્ટમાં ગરમી અંગે ડરામણો ખુલાસોHeat Wave: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થઈ ગયું છે. આ આંકડા જેની સાક્ષી પૂરી રહ્યા છે. અમદાવાદમાં 37 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, વડોદરામાં 38 ડિગ્રી ગરમી, સુરતમાં 38 ડિગ્રી ગરમી, ડીસામાં 38 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ.
Read more »
Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..Btech student Varshini: అఘోరీ ఘటనలో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కుటుబంతో అఘోరీ నాగ సాధు చిచ్చుపెట్టిందని వర్షిణి అనేక యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read more »
PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఛాన్స్.. ఇలా రూ.10 లక్షలు పొందే అవకాశం..PM Mudra Yojana: ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhana mantri Mudra Yojana) ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. సొంతగా బిజినెస్ చేసుకునే వారికి ఇది గొప్ప వరమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాల్లో ప్రధానమంత్రి ముద్ర యోజన ఒకటి.
Read more »
