Kota Srinivasa Rao Best Movies: తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాస రావు నటనకు పెట్టని కోట. ఎన్నో చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలను మేము ప్రస్తావిస్తున్నాము.
Kota Srinivasa Rao Best Movies : తెలుగు లెజండరీ నటుడు కోట శ్రీనివాస రావు నటనకు పెట్టని కోట. ఎన్నో చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆయన కెరీర్ లో ఎన్నో బెస్ట్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలను మేము ప్రస్తావిస్తున్నాము.
మేము ప్రస్తావించే వాటిలో ప్రేక్షకులకు కోరుకునే బెస్ట్ మూవీస్ కూడా ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ ఆయన యాక్ట్ చేసిన చిత్రాల్లో బెస్ట్ లో బెస్ట్ కొన్ని మూవీస్ ఏంటో లుక్కేద్దాం.. కోట చిత్రాలు.. కోట శ్రీనివాస రావు తన మెప్పించిన సినిమాలు కోకొల్లలు. ఎన్నని చెప్పగలము. ఒక్కో చిత్రంలో ఒక్క వెరైటీ పాత్రలతో విలన్ గా, కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సినిమాలో ఎన్నో ఉన్నాయి. ప్రతిఘటన.. కోట శ్రీనివాస రావు నటించిన చిత్రాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ‘ప్రతిఘటన’. విజయశాంతి కథానాయికగా టీ.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మినిష్టర్ కాశయ్య పాత్రలో కోట నటనను ఎవరు మరిచిపోలేరు. అహనా పెళ్లంట.. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అహనా పెళ్లంట’ సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించాడు. పిసినారి పాత్రలంటే ఎలా ఉంటాయో ఈ సినిమాలో చేసి చూపించారు కోట. అటు ఆమెలో కూడా అదే తరహా పాత్రలో నటించడం విశేషం. జయమ్ము నిశ్చయమ్మురా.. హాస్య బ్రహ్మ తన చిత్రాల్లో కోటను వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. ఈ సినిమాలో సినిమా కథలను చెప్పే పటేల్ గా తెలంగాన యాసలో చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎవరు మరిచిపోలేదు. అటు హై హై నాయకా చిత్రాల్లో ఈయన ఊరు మోతుబరి పాత్రలో పలకించిన డైలాగులు ఎవరు మరవలేదు. చూపులు కలిసిన శుభవేళ.. జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చూపులు కలిసిన శుభవేళ’ చిత్రంలో అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వ్యక్తి పాత్రలో కోట నటనను ఎవరు మరిచిపోలేరు. శివ- గాయం.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఈయన అనుబంధం ప్రత్యేకం. శివ చిత్రంలో మాచిరాజు అనే రాజకీయ నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచపోలేరు. అటు గాయం చిత్రంలో ‘గురు నారాయణ’గా అనే పొలిటిషన్ గా కోట నటనకు మెచ్చుతునక అని చెప్పాలి. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ‘ఖండిస్తున్నా.. ఖండిస్తున్నా..అంటూ చెప్పిన డైలాగ్ ఎవరు యాది మరవరు. రెండిళ్ల పూజారి.. రెండిళ్ల పూజారిలో సక్కు బాయ్ అనే హిజ్రా పాత్రలో కోట శ్రీనివాస రావు నటన ఎవర్ గ్రీన్. ఈ చిత్రంలో విలన్ ఆయన పండించన నటన ఎప్పటికీ ఇప్పటికీ కొత్త నటులకు ఓ డిక్షనరీ అని చెప్పాలి. మామ గారు.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘మామగారు’ సినిమాలో పోతరాజు పాత్రలో బామ్మర్ది ఇంట్లో పడితినే పాత్రలో కోట నటనను ఏమని చెప్పాలి. ఈ సినిమాలో బాబు మోహన్ తో ఈయన కాంబినేషన్ సీన్స్ ఎవర్ గ్రీన్. తొలిసారి వీళ్లిద్దరు బొబ్బిలిరాజా సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత చినరాయుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఏవండీ.. ఆవిడొచ్చింది.. దర్శకుడు ఇవివి సత్యనారాయణతో ఈయనది విడదీయరాని అనుబంధం. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏవండి .. ఆవిడొచ్చింది’ సినిమాలో శోభన్ బాబు బామ్మర్ధిగా అద్భుతమైన అభినయం కనబరిచారు. అటు ఆమె, అల్లుడా మజాకా వంటి ఎన్నో చిత్రాల్లో కోట నటన ప్రత్యేకమనే చెప్పాలి. హలో బ్రదర్.. అదే ఇవివి దర్శకత్వంలో హలో బ్రదర్ చిత్రంలో ఎస్సై తాటి మట్టయ్య పాత్రలో ఈయన నటన ఎరవు మరిచిపోలేదు. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కామెడీ పండించిన కోట.. చివర్లో తన తోటి కానిస్టేబుల్ మల్లిఖార్జున రావు చనిపోయే సీన్ లో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. మనీ.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో శివనాగేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనీ’ చిత్రంలో భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్’ అంటూ అల్లాద్దీన్ పాత్రలో కోట చెప్పిన డైలాగులు, పాటలు ఎవర్ గ్రీన్. గణేష్.. వెంకటేశ్ హీరోగా దివంగత తిరుపతి స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గణేష్’ చిత్రంలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడిగా ఈయన నటనను ఎవరు మరిచిపోగలరు. మొత్తంగా ఈ సినిమా సక్సెస్ లో పెట్టని కోటగా నిలిచారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే.. బృందావనం.. కేవలం విలన్ గా, కమెడియన్ గానే కాకుండా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో అద్భుత అభినయాన్ని కనబరిచారు. ముఖ్యంగా ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ తండ్రి పాత్రలో ఒదిగిపోయిన తీరు చివర్లో విషాదాంతం కావడం ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి. బృందావనం హీరోయిన్ తాత పాత్రలో ఇంటి పెద్దగా ఈయన నటనకు ప్రత్యేక స్థానం ఉంది. Old 1 Rupee Note: గుడ్ న్యూస్.. పాత రూ.1 నోట్లు ఉంటే.. ఇప్పుడే రూ.14 లక్షలు పొందొచ్చు..Kota Srinivas Rao: ఎన్నో వందల సినిమాలు.. లెక్కలేనన్ని అవార్డులు.. ఆస్తి రూపంలో ఎన్ని కోట్లు సంపాదించారంటే..?
Kota Srinivasa Rao Top Movies Kota Srinivasa Rao Best Acting Kota Srinivasa Rao No More Tollywood
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?Top 10 Engineering Colleges in AP: ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలను జాయిన్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ పేర్కొన్న లిస్టులో ఏపీలోని టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. NIRF యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇవి టాప్ లో నిలిచాయి.
Read more »
– ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (AI and ML) కోర్సు అందిస్తున్న టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..!!Artificial Technology Course in Telangana: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
Read more »
Kota Srinivas Rao: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..!Kota Srinivas Rao Passes Away: ప్రముఖ తెలుగు సినిమా నటుడు కోట శ్రీనివాస రావు (83) కన్నుమూశారు. యాక్టర్, రాజకీయ నేతగా కూడా పనిచేసిన ఈయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
Read more »
Kota Srinivasa Rao: నటనకు పెట్టని ‘కోట’.. నవరసాల కంచు ‘కోట’ సినీ కెరీర్ లో కీలక ఘట్టాలు..Kota Srinivasa Rao Passes Away: తెలుగు సినిమా చరిత్రలో కొద్ది మంది మాత్రమే తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు.
Read more »
Kota Vs Chiranjeevi: చిరంజీవితో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం.. ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం..Kota Vs Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక స్థానం ఉంది. నాగభూషణంలోని హాస్య చతురత.. రావు గోపాల రావులోని విరుపు..సత్యనారాయణలోని గంభీరం.. నూతన్ ప్రసాద్ లోని విలక్షణ నటన.. వీళ్లందిరిని కలిపితే ఓ కోట శ్రీనివాస రావు.
Read more »
Kota Srinivasa Rao: బాబు మోహన్ తో కోట శ్రీనివాస రావుకు ప్రత్యేక అనుబంధం.. ఇద్దరి జీవితాల్లో ఆ విషాదాలు..Kota Srinivasa Rao: తెలుగు సినిమాల్లో తనదైన విలక్షణ నటనతో మెప్పించిన నటుడు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన మరణంతో తెలుగు సినిమాల్లో మరో శకం ముగిసిందని చెప్పాలి. ఇక కోటకు ఆయన తోటి నటుడు బాబు మోహన్ తో ప్రత్యేక అనుబంధం ఉంది.
Read more »
