Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!

Mana Shankara Varaprasad Garu Review News

Mana Shankara Varaprasad Garu Review: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ రివ్యూ.. చిరంజీవి కుమ్మేసాడా..!
Mana Shankara Varaprasad Garu Garu TargetMana Shankara Varaprasad Garu WW Pre Release BusiMana Shankara Varaprasad Garu First Day Collectio
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 348 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

Mana Shankara Varaprasad Garu Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నయనతార హీరోయిన్ గా నటించింది.

Mana Shankara Varaprasad Garu Review : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. చిరంజీవి తన సొంత పేరుతో నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

నయనతార హీరోయిన్ గా నటించింది. పైగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన క్యూరియోసిటీ ఏర్పడింది. మరి ఆ అంచనాలను ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..Gold Rate Today: సంక్రాంతి ముందు పసిడి ప్రియులకు సడెన్ షాక్.. జనవరి 11వ తేదీ ఆదివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే వెంటనే చెక్ చేస్తారు..!!: చిరంజీవి సినిమాల్లోకి రాకముందు వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘శివ శంకర వర ప్రసాద్’. ఇపుడు అదే ‘మన శంకర వర ప్రసాద్’ టైటిల్ తో హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. మరి ఆదివారం రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..శంకర వర ప్రసాద్ కేంద్ర మంత్రి నితిన్ శర్మ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. ఆయన్ని పలు సందర్బాల్లో కాపాడిన నేపథ్యంలో శంకర వర ప్రసాద్ ను తన ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో అతని గతాన్ని తెలుసుకుంటాడు. దేశంలో టాప్ లేడీ బిజినెస్ ఉమెన్ శశిరేఖ తో పెళ్లై విడాకులు అవుతాయి శంకర వర ప్రసాద్ కు. ఇక పిల్లలు ప్రసాద్ కు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో అతని పిల్లలు ఓ బోర్డింగ్ స్కూళ్లో చదువుతున్నారనే విషయం తెలుసుకొని అక్కడికి కేంద్ర మంత్రి నితిన్ శర్మ.. శంకర్ వర ప్రసాద్ ను అక్కడి పంపిస్తాడు. అక్కడ పీటీ టీచర్ గా జాయినై వాళ్లకు దగ్గరవుతాడు. ఆ తర్వాత అతను అక్కడ ఉన్నాడని తెలుసుకొని శశిరేఖ పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో శంకర్ వర ప్రసాద్ మామగారు పై ఎవరో దుండుగులు ఎటాక్ చేస్తారు. ఆ తర్వాత కేంద్రం శశిరేఖ తండ్రికి స్పెషల్ సెక్యురిటీ ఆఫీసర్ గా శంకర వరప్రసాద్ ను నియమిస్తుంది. సెక్యురిటీ ఆఫీసర్ గా మామ గారి ఇంట్లో అడుగుపెట్టిన శంకర్ వర ప్రసాద్.. తన పిల్లలకు, భార్యకు దగ్గరయ్యాడా..? ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ వీళ్ల లైఫ్ లో ఎంట్రీ ఇస్తాడు. అతని ప్రవేశంతో మన శంకర వర ప్రసాద్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది. అసలు శశిరేఖ తండ్రిపై ఎటాక్ ఎందుకు జరిగింది. ఎవరు చేశారు..? మొత్తంగా ఏం జరిగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్’ సినిమాను చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’తో పాటు కొన్ని పాత సినిమాలను మిక్స్ లో వేసి కొత్తగా తయారు చేసిన వంటకం అని చెప్పాలి. అంతేకాదు అందులో తన మార్క్ ఉండేలా చూసుకున్నాడు. ఘరానా మొగుడులో చిరంజీవి ఫ్యాక్టరీ వర్కర్ గా చూపిస్తే.. ఇందులో సెంట్రల్ సెక్యురిటీ ఆఫీసర్ గా చూపెట్టాడు. ఇక కథకు కాళ్లు ఉండవు.. ముంతకు చెవులుండవు అనే తరహాలో ఈ సినిమాలో అనిల్ రావిపూడి బోలేడు లాజిక్స్ మిస్ అయ్యాడు. అవన్ని వెతుక్కుంటూ వెళితే ఈ సినిమాలో బోలెడు బొక్కలున్నాయి. ఏ సీన్ ఎపుడు ఎలా వస్తుందన్న క్యారిటీ లేదు. ఆ సంగతి పక్కన పెడితే.. చిరంజీవిని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అందులో మెచ్చుకోవాల్సిందే. మొత్తంగా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్ ను చేసేసాడు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ ను పూర్తిగా వాడుకున్నాడు. చిరంజీవి మాస్ హీరో మాత్రమే కాదు..ఆయనలో మంచి కమెడియన్ ఉన్న సంగతి పలు సినిమాల్లో ప్రూవ్ అయింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి తనకు కలిసొచ్చినా.. భార్య బాధితుడుగా చిరంజీవి చూపెట్టాడు. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురును అల్లుడు నుంచి వేరు చేయడంలో మామ కుట్రలు. ఈ క్రమంలో విడాకులు తీసుకొని భార్యా పిల్లలకు దూరంగా ఉండటం మూలానా ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారనేది ఇలాంటి బాధ అనుభవిస్తున్న వారికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పిల్లలకు దగ్గర కావడానికి తనకున్న అధికారులను యూజ్ చేసుకొని పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూళ్లో పీటీ టీచర్ గా చిరు జాయిన్ కావడం.. ఆ తర్వాత వాళ్ల దగ్గరవడం.. అదే సమయంలో అతని భార్య పిల్లలను దూరం చేయడం వంటివి తండ్రి బిడ్డల సెంటిమెంట్ ను పండించాడు. మామగారు.. అల్లుడును అవమాన పరచడం.. ఆ తర్వాత మామపై కసి తీర్చుకునే అల్లుడు తరహాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులకు ఫన్ తెప్పిస్తాయి. ఇందులో చిరంజీవి పాత వింటేజ్ పాత్రలను అలా టచ్ చేసి విడిచిపెట్టాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఆడవాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలు.. వాళ్లను కాపాడానికి కాకుండా.. మగాళ్లను కప్పేట్టాలా ఉన్నాయని కొంత మంది మహిళలతో కామెడీ చేయించినా.. ఈ మధ్య మిస్ యూజ్ అవుతున్న చట్టాల గురించి ఫన్నీగా చిరుతో చెప్పించాడు అనిల్ రావిపూడి. చిరుతో కేవలం హాస్యం మాత్రమే కాదు..ఆయనలోని డాన్సర్ ను ఫుల్ గా వాడుకున్నాడు. హుక్ స్టెప్ , మీసాల పిల్ల సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక క్లైమాక్స్ లో వెంకీ ఎంట్రీ అదిరిపోయింది. చిరుతో అతని సీన్స్ పండాయి. ముఖ్యంగా చిరు పాత పాటలకు వెంకీ స్టెప్పులు వేయడం.. అలాగే వెంకీ పాటలకు చిరు స్టెప్పులు వేయడం బాగుంది. బాలీవుడ్ లో ఓ బడా హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ గా నటించడం అనే సాంప్రదాయం ఈ సినిమాతో మొదలు పెట్టాడు అనిల్. ఏదో అతిథి పాత్రలా కాకుండా సినిమా కథకు సంబంధించిన పాత్రలో వెంకీ పాత్రను ప్రవేశపెట్టి చివరకు ఆ పాత్రతో ప్రేక్షకులను ట్రావెల్ అయ్యేలా చేసాడు. ఇకపై మన హీరోలు.. ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ చేస్తే చూసే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. పూర్తి ఫ్యామిలీ సినిమాలో మాస్ అంశాలు ఉండేలా చూసుకున్నాడు. మొత్తంగా పండగ పూట లాజిక్ ను పక్కన పెట్టి కుటుంబం మొత్తం సరదగా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించేలా ఒక్క అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవడం.. భార్య, భర్తల మధ్య అనుబంధం.. తండ్రి బిడ్డల సెంటిమెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మొత్తంగా అనిల్ రావిపూడి కథ రొటీన్ అయినా.. దాన్ని తెరకెక్కించిన విధానం.. రిలీజైన టైమింగ్ కలిసొచ్చే అంశాలనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. భీమ్స్ పాటలు అదిరిపోయాయి. ఒక్క పాటకు కూడా ప్రేక్షకులు బయటకు వెళ్లకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు. రౌడీ అల్లుడు ఉండే లవ్ లీ మై హీరో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని సీన్స్ తీసినా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం ముంది. 70 యేళ్ల వయసులో ఈ గ్రేస్ తో స్టెప్పులు.. కామెడీ టైమింగ్ తో జెన్ జీ తరం వాళ్లకు తను ఎందుకు మెగాస్టార్ అయ్యాడనే విషయాన్ని సినిమాలో చెప్పాడు. చిరంజీవి ప్రతి సీన్ లో ఎంత ఎనర్జిటిక్ గా నటించాడు. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే హీరోలా తనను తాను భార్య బాధితుడైన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో ఇరగదీసాడు. వెంకటేష్ ఉన్నది కాసేపు అయినా.. తన మార్క్ నటనతో సినిమాకు అదనపు జోష్ తీసుకొచ్చాడు. వెంకీ గౌడగా బళ్లారి బిజినెస్ మ్యాన్ గా అదరగొట్టాడు. చిరు, వెంకీల మధ్య సీన్స్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. లాస్ట్ 20 నిమిషాలు నాన్ స్టాప్ గా అలాగే సాగిపోతుంది. నయనతార పొగరుబోతు భార్య పాత్రలో జీవించింది. ఆమె యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సని పనిలేదు.సచిన్ ఖేడ్ ఖర్ విలన్ తరహా మామ పాత్రలో ఒదిగిపోయాడు. కేంద్ర మంత్రిగా శరత్ సక్సేనా.. కేథరిన్, హర్షవర్ధన్ తో పాటు ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Uttara Khand: ఇది కదా విశ్వాసం.. పెద్దపులితో ఫైటింగ్‌కు దిగిన పెంపుడు శునకం.. చివరకు ఏంజరిగిందంటే..?Broccoli Weight Loss: డైట్, జిమ్ అవసరమే లేదు..దీన్ని తింటే కేవలం ఒక వారంలోనే బరువు తగ్గుతారు! ఎలా అంటే?Zee Media Beyond AI CVs And JDs: పెరుగుతున్న ఏఐ వినియోగం.. సంస్థలకు ఏ విధంగా సహాయ పడుతుంది?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mana Shankara Varaprasad Garu Garu Target Mana Shankara Varaprasad Garu WW Pre Release Busi Mana Shankara Varaprasad Garu First Day Collectio Mana Shankara Vara Prasad Garu First Review Mana Shankara Varaprasad Garu Mana Shankara Varaprasad Garu Preimiers Mana Shankara Vara Prasad Garu Release Date Anil Ravipudi Chiranjeei Tollywood Telugu Cinema

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Mana Shankara Varaprasad Garu: పండగ పూట చిరంజీవికి ‘మన శంకర వర ప్రసాద్’ మూవీకి హైకోర్టు షాక్..Mana Shankara Varaprasad Garu: పండగ పూట చిరంజీవికి ‘మన శంకర వర ప్రసాద్’ మూవీకి హైకోర్టు షాక్..Mana Shankara Varaprasad Garu:సంక్రాంతి పండగ వేళ తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ ధరల వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభాస్ లేటెస్ట్‌ మూవీ రాజా సాబ్ టికెట్ల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టికెట్ ధరల పెంపునకు నో చెప్పింది.
Read more »

பராசக்தி X விமர்சனம் : தீ பரவியதா? பதுங்கியதா? ரசிகர்கள் சொல்வது இதுதான்..பராசக்தி X விமர்சனம் : தீ பரவியதா? பதுங்கியதா? ரசிகர்கள் சொல்வது இதுதான்..Parasakthi X Review Tamil : சிவகார்த்திகேயன் நடிப்பில் வெளியாகி இருக்கும் படம், பராசக்தி. இந்த படத்தின் எக்ஸ் தள விமர்சனத்தை இங்கு பார்ப்போம்.
Read more »

Parasakthi Review: பராசக்தி படம் எப்படி உள்ளது? திரைவிமர்சனம் இதோ!Parasakthi Review: பராசக்தி படம் எப்படி உள்ளது? திரைவிமர்சனம் இதோ!Dawn பிக்சர்ஸ் தயாரிப்பில் சுதா கொங்கரா இயக்கத்தில் சிவகார்த்திகேயன், ரவி மோகன் மற்றும் அதர்வா நடித்துள்ள பராசக்தி படம் இன்று திரையரங்குகளில் வெளியாகியுள்ளது.
Read more »

Telangana Govt: కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా..?... చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం..Telangana Govt: కోర్టు మొట్టికాయలు వేస్తున్న మారరా..?... చిరంజీవి మూవీ రిలీజ్ వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం..Mana shankara vara prasad movie release: ఇటీవల హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్న కూడా తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు తరచుగా టికెట్ల ధరల పెంపుపై జీవోలు జారీచేయడంపై తెలంగాణ రాజకీయాల్లో దుమారం రాజుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు ఆదేశాలంటే గౌరవంలేదా అంటూ మండిపడుతున్నారు.
Read more »

Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..Mana Shankara Varaprasad Garu WW Pre Relase Business: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. వరుస హిట్స్ తో దూకుడు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది.
Read more »

Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!Mana ShankaraVaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్‌కు ముందే ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Read more »



Render Time: 2026-04-02 17:45:21