PF ATM-UPI Withdrawal Rules: ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకునే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం తీసుకువస్తామని ఇదివరకే ప్రకటించింది.
EPFO Latest Update: కొత్త ఏడాదిలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా. కేంద్ర మంత్రి కీలక అప్ డేట్.!! PF ATM-UPI Withdrawal Rules: ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకునే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
EPFO Latest Update: కొత్త ఏడాదిలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర మంత్రి కీలక అప్ డేట్..!! PF ATM-UPI Withdrawal Rules: ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ నిధులు విత్ డ్రా చేసుకునే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం తీసుకువస్తామని ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు. 2026 మార్చిలోపు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఓ జాతీయ వార్తా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కలిగించే కీలక నిర్ణయాన్ని తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. త్వరలోనే EPF ఖాతాదారులు ATMలు, UPI ద్వారా తమ పీఎఫ్ నిధులను నేరుగా ఉపసంహరించుకునే అవకాశం కలగనుంది. ఈ కొత్త వ్యవస్థను మార్చి 2026కు ముందే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు.ప్రస్తుతం కూడా ఉద్యోగులు తమ EPF ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు. అయితే భవిష్యత్తులో ఈ ప్రక్రియ మరింత డిజిటల్‌గా, వేగంగా, సులభంగా మారనుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఉపసంహరణ కోసం అనేక ఫారమ్‌లు పూరించడం, ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లు వేయడం, ధృవీకరణ కోసం ఎదురుచూడడం వంటి దశల వల్ల ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ఆలస్యాలన్నింటినీ తొలగించడమే కొత్త వ్యవస్థ లక్ష్యమని మంత్రి తెలిపారు.ప్రస్తుత విధానంలో ఈపీఎఫ్ నిధులు పూర్తిగా ఉద్యోగికి చెందినవే అయినప్పటికీ, విధివిధానాల క్లిష్టత వల్ల చాలా సందర్భాల్లో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయి లేదా జాప్యం అవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు EPFO పలు కీలక సంస్కరణలకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. గతంలో PF ఉపసంహరణలకు 13 రకాల వేర్వేరు కేటగిరీలు ఉండేవి. ప్రతి కేటగిరీకి ప్రత్యేకమైన షరతులు, వేర్వేరు సేవా కాలాలు ఉండటంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొనేది. ఇప్పుడు అన్నికేటగిరీలను విలీనం చేసి సులభమైన విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ మార్పులతో మరో ముఖ్యమైన లాభం కూడా ఉద్యోగులకు అందనుంది. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో PF ఉపసంహరణలో ఉద్యోగి వాటా మాత్రమే అందేది. తాజా సంస్కరణలతో ఉద్యోగి సహకారంతో పాటు యజమాని సహకారం, దానిపై వచ్చిన వడ్డీ కూడా ఉపసంహరణలో భాగం అవుతుంది. దీని వల్ల 75 శాతం PF ఉపసంహరణ మొత్తం గతంతో పోలిస్తే మరింత పెరుగుతుంది. అర్హత నిబంధనల విషయంలో కూడా EPFO పెద్ద మార్పులు చేసింది. గతంలో వివిధ కారణాల ఆధారంగా 2 నుంచి 7 సంవత్సరాల వరకు సర్వీస్ టైమ్ అవసరం ఉండేది. అయితే ఈ నిబంధనలను సవరించి ఒకే విధంగా ఏడాది ఉన్నా సరిపోతుంది. అంటే ఒక ఏడాది పనిచేసిన తర్వాతే ఉద్యోగులు ఎక్కువ మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగ పరిస్థితుల్లో ఉద్యోగి వెంటనే 75 శాతం PFని ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని ఒక సంవత్సరం తర్వాత తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే 55 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, ఉద్యోగం నుంచి తొలగింపు, స్వచ్ఛంద పదవీ విరమణ లేదా విదేశాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం వంటి సందర్భాల్లో మొత్తం PFని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. మొత్తంగా చూస్తే, EPFO తీసుకుంటున్న ఈ చర్యలు పీఎఫ్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా, వేగవంతంగా, ఉద్యోగి-స్నేహపూర్వకంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగుగా భావించవచ్చు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు వెంటనే స్పందించేలా ఈ కొత్త విధానం రూపుదిద్దుకోనుంది. Best Mileage Bike Under 55 K : షైన్, స్ప్లెండర్.. ఈ బైక్ ముందు జుజుబీ.. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే మీ లవర్‌తో జిల్లా మొత్తం చుట్టేయ్యోచ్చు.. ధర కూడా చాలా చీప్..!!IPL 2026 Auction: జాక్ పాట్ కొట్టిన శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానా.. 18 కోట్లకి దక్కించుకున్న కేకేఆర్..!
PF Money Epfo Employees Provident Fund Scheme Epfo Pf Unifiedportal Business News Business News Today
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ऑस्ट्रेलिया में त्योहार मना रहे यहूदियों पर 50 राउंड फायरिंग: 15 PHOTOS- बीच पर लाशें बिछीं; बुजुर्ग ने आतं...Australia Sydney Mass Shooting Photos Update; Follow Bondi Beach Latest News On Dainik Bhaskar.
Read more »
वर्ल्ड अपडेट्स: ईरान बोला- हिजबुल्लाह को इजराइल के खिलाफ समर्थन देते रहेंगे; बड़े पैमाने पर हथियार और पैसा ...International Breaking News Headlines Update; Dainik Bhaskar Breaking News Headlines Today, and World Latest Pictures Videos, Pictures, and More From Dainik Bhaskar.
Read more »
मोदी सरकार की मनरेगा खत्म करने की तैयारी: नया बिल लाया जा रहा, सांसदों को कॉपी बांटी; 2005 में स्कीम लॉन्च ...The Viksit Bharat (VB-G RAM G Bill) Update; Follow MNREGA Controversy, Parliament Winter Session 2025, BJP Congress Latest News On Dainik Bhaskar.
Read more »
EPFO Withdrawl new rule: প্রভিডেন্ট ফান্ডে বড় পরিবর্তন! টাকা তোলার জন্য আর ব্যাংক নয়, পিএফ তুলুন ATM থেকেই...কী ভাবে?pf withdrawal through upi and atm before march how epfo withdrawal process will become easier
Read more »
जज कैश कांड-सुप्रीम कोर्ट का लोकसभा अध्यक्ष को नोटिस: पूछा- राज्यसभा में महाभियोग प्रस्ताव नामंजूर फिर जांच...Delhi Judge Yashwant Varma Bungalow Cash Recovery Case Update; Follow Supreme Court, CJI BR Gavai, Kapil Sibal Latest News On Dainik Bhaskar.
Read more »
मेसी विवाद, बंगाल के स्पोर्ट्स मिनिस्टर का इस्तीफा: SIT जांच करेगी, स्टेडियम CEO को हटाया; फुटबॉलर 22 मिनट ...West Bengal Sports Minister Aroop Biswas Resignation Update; Follow Lionel Messi GOAT India Tour Kolkata Event Row Latest News On Dainik Bhaskar.
Read more »
