BC Bandh: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా నేడు తెలంగాణ బంద్.. బీసీ సంఘాల పిలుపు..

BC Bandh News

BC Bandh: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా నేడు తెలంగాణ బంద్.. బీసీ సంఘాల పిలుపు..
Telangana BC BandhTelangana Local Body ElctionsTelangana Bandh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 189 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Telangana BC Bandh: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ కు బీసీ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలిపారు.

Telangana BC Bandh: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ కు బీసీ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలిపారు.:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని బీసీ JAC నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తొలిసారిగా సైంటిఫిక్‌గా తెలంగాణలో కులగణన నిర్వహించామని చెప్పారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినట్లు తెలిపారు. చట్ట సభల్లో ఏకగ్రీవంగా ప్రవేశ పెట్టామని.. గవర్నర్, రాష్ట్రపతికి పంపించినట్లు తెలిపారు. అయితే తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకట్ట వేసి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈనెల 18న రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.జీవోల ద్వారా కాకుండా రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ చేసి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైకోర్టు లాగానే సుప్రీంకోర్టు కూడా కేసును కొట్టు వేసే అవకాశం ఉందని బిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి చెబుతూనే ఉన్నదన్నారు. తాము చెప్పిన విధంగానే జరిగిందన్నారు. కామారెడ్డి లో ఇచ్చిన డిక్లరేషన్ను అమలుపరచాలని డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం నేడు తలపెట్టిన బీసీల బందుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 42 శాతం కోటా కోసం రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు బీసీ సంఘాల నేతలు. నేటి బంద్ కు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. మంత్రుల నుంచి అందరూ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాలు బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.బంద్ కు 35 బీసీ సంఘాలు, 136 కుల సంఘాలు మద్దతిచ్చాయని తెలిపారు. దాడులు చేయకుండా బందు శాంతియుతంగా నిర్వహించాలని కోరారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య. అటు కాంగ్రెస్ పార్టీ కావాలనే బీసీల జీవితాలతో నాటకాలు ఆడుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజ్యాంగ బద్దంగా వ్యవహరించకుండా ఆ నెపాన్ని బీజేపీపై రుద్దాలని చూస్తున్నారన్నారు. 42శాతం BC రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బీసీ బంద్‌కు మద్దతుగా ఆయన దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తా నుంచి ముసారాంబాగ్‌ చౌరస్తా వరకు నిన్న పాదయాత్ర చేపట్టారు. బీసీ హక్కుల కోసం బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రలో వందలాది మంది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి… సరైన వాటా ఇవ్వాలి… అంటూ నినాదాలు చేశారు. బీసీ సమాజం పట్ల నిర్లక్ష్యం ఆపాలని, బీసీలకు సమాన హక్కులు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలకు ముందస్తుగా సెలువులు ప్రకటించారు. మరోవైపు ఆఫీసులు నామ మాత్రంగా పనిచేయనున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Konda Surekha Controversy: అపుడు సమంత.. ఇపుడు సుమంత్..కొండా సురేఖ మంత్రి పోస్ట్ ఊస్టింగేనా..?Konda Surekha: తెలంగాణలో టెండర్ల పెంట.. అసలు కొండా సురేఖ, రేవంత్‌ వ్యవహారంలో జరిగింది ఏమిటి?Konda Surekha Daughter Video: మా జోలికి వస్తే బాగుండదు.!. రేవంత్‌కు కొండా సురేఖ కూతురు మాస్ వార్నింగ్.. వీడియో..Konda Surekha Daughter Video: మేం ఫైటర్స్.. ఏంపీకలేరు.!. రేవంత్ రెడ్డికి కొండా సురేఖ కూతురు మాస్ ధమ్కీ.. వీడియో..Konda Surekha VS Revanth: మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తారాస్థాయికి చేరిన వివాదం..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana BC Bandh Telangana Local Body Elctions Telangana Bandh KTR BC Organisations Brs Party BC Bandh October 18Th Telangana Bandh

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

रिमझिम बारिश से निचले इलाकों में भरा पानी: जिले के पोखर, तालाब और बांध हुए फुल, मौसम में बढ़ी ठंडक से लोगों ...रिमझिम बारिश से निचले इलाकों में भरा पानी: जिले के पोखर, तालाब और बांध हुए फुल, मौसम में बढ़ी ठंडक से लोगों ...Due to drizzling rain, low lying areas got filled with water/bharatpur/baandh baraitha/kaundhni bandh/jalbharav/rain/barish
Read more »

भरतपुर में खेतों में घुसा बारिश का पानी: किसान बोले- सड़क की वजह से पानी नहीं निकल रहा, फसलें खराब हुईभरतपुर में खेतों में घुसा बारिश का पानी: किसान बोले- सड़क की वजह से पानी नहीं निकल रहा, फसलें खराब हुईRainwater entered the village where fields were submerged in water/Bharatpur/Wair/Ajrauda Village/Ajrauda Bandh/Fasal Kharab
Read more »

PM Modi की मां के अपमान को लेकर Bihar Band, सड़क पर प्रदर्शन करने उतरे BJP कार्यकर्ता; देखें VIDEOPM Modi की मां के अपमान को लेकर Bihar Band, सड़क पर प्रदर्शन करने उतरे BJP कार्यकर्ता; देखें VIDEOBihar Bandh: बिहार में विधानसभा चुनाव से पहले सियासी माहौल गरमाया हुआ है. अब विपक्ष को NDA ने घेरा Watch video on ZeeNews Hindi
Read more »

Telangana Private Colleges Bandh: ప్రభుత్వంతో తెలంగాణ ప్రైవేటు కాలేజీల చర్చలు విఫలం.. కాలేజీలు నిరవధిక బంద్..Telangana Private Colleges Bandh: ప్రభుత్వంతో తెలంగాణ ప్రైవేటు కాలేజీల చర్చలు విఫలం.. కాలేజీలు నిరవధిక బంద్..Telangana Private Colleges Bandh: తెలుగు రాష్ట్రాల్లో మన పాలకుల ఒక పకడ్బందీ పథకం ప్రకారంప్రభుత్వ బడులు, కాలేజీలను నిర్వీర్యం చేశారు. దీంతో పుట్టగొడుగుల్లా ప్రైవేటు కాలేజీలు పుట్టుకొచ్చాయి.
Read more »

Supreme on BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..Supreme on BC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..Supreme on BC Reservations: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Read more »

Supreme court on Bc Reservation: రేవంత్‌ సర్కారుకు దెబ్బమీద దెబ్బ.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..Supreme court on Bc Reservation: రేవంత్‌ సర్కారుకు దెబ్బమీద దెబ్బ.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..Supreme court big shock to revanth reddy govt: బీసీ రిజర్వేషన్ అంశంపై రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాత రిజర్లేషన్ పద్దతిలో ఎన్నికలకు పోవచ్చని తెలిపింది.
Read more »



Render Time: 2026-04-02 01:12:38