Shani Dev Blessings in Pushya Masam: శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసం. ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలన్ని తొలగిపోతాయి. పుష్య అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం.
: శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసం. ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలన్ని తొలగిపోతాయి."పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.
పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైంది. కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా పరిగణిసతోంది జ్యోతిష శాస్త్రం.పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్న ఉవాచ. పుష్య మాసం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరం. శని దేవుడు జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటే మీకు ఎలాంటి ఋణ బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి.పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం అత్యంత శ్రేష్ఠం ముహూర్త చింతామణి చెబుతుంది. ఇక నవగ్రహ లేదా శని దేవుడికి సంబంధించిన దోషాలున్నవారు నవగ్రహాలున్న ఆలయానికి వెళ్లి.. మూడు లేదా 9 ప్రదక్షిణలు చేయడం వలన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ రోజు నల్ల బట్ట, నల్ల నువ్వులు, నూనెతో శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. శని వారం పేద వాళ్ల బట్టలు లేదా ఆహారం దానం ఇస్తే శని దేవుడు తీక్షణ దృష్టి మీపై పూర్తిగా తగ్గిపోతుంది. ఆయన శుభదృష్టి వలన అనేక దోషాలు తొలిగిపోతాయి. గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, అంతర్జాలం, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ సమాచారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.Bigg Boss: బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్.. టాప్ 5 నుంచి ఆ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఔట్..!Shani Rahu Ketu 2026 Effect
Shani Dev Remedies Shani Dev Raja Yogam Shani Rahu Yuthi Astrology Zodiac Signs
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
शनिदेव के 10 शक्तिशाली नाम जिनका जाप कर पा सकते हैं शांति, धन और सेहत का आशीर्वाद, होगा दुखों का नाश!Shani Dev ke 10 naams to get Shanidev Blessings: शनिवार का दिन सूर्य पुत्र शनिदेव को समर्पित है.
Read more »
Shani dev 2026: साढ़ेसाती-ढैय्या से राहत का साल 2026! घर ले आएं शनिदेव की ये प्रिय चीजेंShani dev 2026: साल 2026 में साढ़ेसाती और ढैय्या से जूझ रहे लोगों के लिए ये पांच सरल चीजें शनि देव की कृपा पाने, नकारात्मक प्रभाव को कम करने और जीवन में स्थिरता लाने में बेहद कारगर मानी जा रही हैं. आइए जानते हैं उन चीजों के बारे में जिनको घर लाना बहुत ही शुभ माना जा रहा है.
Read more »
Shani Chalisa Lyrics: शनिदेव की कृपा पाने के लिए उत्तम है शनिवार, जरूर करें शनि चालीसा का पाठमाना जाता है कि शनिवार के दिन शनि चालीसा का पाठ करने से न्याय का देवता शनिदेव प्रसन्न होते हैं। शनि चालीसा, शनिदेव की स्तुति है, जो उनके स्वरूप और न्यायप्रियता का वर्णन करती है। ऐसे में आप शनि चालीसा का असली अर्थ समझते हुए इसका पाठ कर सकते हैं।
Read more »
Shani Paya 2026 Rashifal: इन 3 राशियों पर शनिदेव का लौह पाया और इन पर रहेगा स्वर्ण, जानें 2026 में मेष से म...Shani Paya 2026 Horoscope: शनि देव 2026 में भी वही सिद्धांत अपनाएंगे, जैसी मेहनत, वैसा फल. कुछ राशियों के लिए नया साल परीक्षा का होगा, तो कुछ राशियों के लिए स्थिरता और राहत का. आप इस आर्टिकल के माध्मय से यह जान सकते हैं कि साल 2026 में किन राशियों पर शनि का ताम्र, लौह, रजत और स्वर्ण पाया रहने वाला है और उसका सभी राशियों पर क्या प्रभाव पड़ेगा...
Read more »
Shani Gocahr 2026: साल 2026 में तुला सहित इन राशियों पर मेहरबान शनिदेव, मिलेगा राजसी सुखShani Gocahr 2026: वर्ष 2026 में कर्मफल दाता शनिदेव का गुरु की राशि मीन में गोचर ज्योतिषीय दृष्टि से बेहद महत्वपूर्ण रहेगा. यह गोचर केवल राशि परिवर्तन नहीं, बल्कि शनि की मार्गी–वक्री चाल और नक्षत्र परिवर्तन के कारण पूरे वर्ष जीवन के कई क्षेत्रों पर प्रभाव डालेगा.
Read more »
Shani Rahu Yuthi: శని, రాహు-కేతు అద్భుత యోగం.. 2026లో ఈ రాశుల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఇదే..Shani Dev - Rahu Yuthi: శని దేవుడు, రాహు-కేతు సంయోగంతో 2026 కొత్త సంవత్సరంలో ఈ రాశులకు పెద్ద సవాలు ఎదురు కాబోతుంది. డిసెంబర్ మూడవ వారం పూర్తైయింది. 2025 సంవత్సరం చివరి దశలో ఉంది. అందరూ కొత్త యేడాది కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read more »
