Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు

Pawan Kalyan News

Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు
Janasena PartyAP ElectionsMangalagiri
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 167 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్న క్రమంలో ఓ స్లిప్‌ అడిగారు. ఎన్నికల సిబ్బందికి అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. అనంతరం ఓటు వేసిన స్లిప్‌ వస్తుందా? అని ప్రశ్నించారని చర్చ జరుగుతోంది. పోలింగ్‌ కేంద్రంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. AP Elections High Tension: పోలింగ్‌ రోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కూటమి ఉంది. సోమవారం ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటు హక్కు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఉదయమే తన సతీమణితో కలిసి పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్‌ సిబ్బంది ఆయన పత్రాలు పరిశీలించి పంపించారు. అనంతరం ఈవీఎం మిషన్‌ వద్దకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఓటేశారు. అయితే ఓటేసిన తర్వాత బయటకు రాలేదు.అక్కడే ఉన్న సిబ్బందితో కొద్దిసేపు మాట్లాడారు. వారి సంభాషణను గమనిస్తుంటే 'ఓటు వేసిన తర్వాత ప్రింట్‌ అవుట్‌ రాదా?' అని ప్రశ్నించారు. 'రాదు సార్‌. వీవీ ప్యాట్‌లో మాత్రమే చూసుకోవచ్చు' అంటూ సిబ్బంది సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ వీడియోను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఆమాత్రం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీవీ ప్యాట్‌ స్లిప్‌ వచ్చేది కానీ కొన్నేళ్లుగా ఎన్నికల సమయంలో ఆ స్లిప్‌ రావడం లేదు. ఇది దాదాపుగా ఓటర్లందరికీ తెలుసు. కానీ ఈ విషయం పవన్‌కు తెలియదా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కాస్త అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చిక్కింది. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. 'పోలింగ్‌ బూత్‌లో అజ్ఞానం చాటిన పవన్‌ కల్యాణ్‌. 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా పవన్‌ కల్యాణ్‌? కర్మ కాకపోతే ఓటు గురించి కనీస పరిజ్ఞానం లేని నువ్వు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడివి. ప్రజలు నిన్ను ఛీ కొట్టడంలో తప్పే లేదు' అంటూ ధ్వజమెత్తింది. కాగా పవన్‌ కల్యాణ్‌ కూటమి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ ఈసారి గెలుపు కోసం తహతహలాడుతున్నారు. తన విజయం కోసం సినీ పరిశ్రమను పిఠాపురంలో దింపారు. అంతేకాకుండా మెగా కుటుంబం, ఇతర సినీ ప్రముఖుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు పొందారు. మరి ఆయన విజయం సాధిస్తారా? లేదా అనేది అత్యంత ఉత్కంఠ ఏర్పడింది. కాగా ఆయనకు పోటీగా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. దాదాపు ఆమెకు విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత ప్రింట్ అవుట్ రాదా? అంటూ అవివేకంగా ప్రశ్న. వీవీపాట్‌లో మాత్రమే చూసుకోవచ్చంటూ సిబ్బంది సమాధానం 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఇదేనా పవన్ కళ్యాణ్? ఖర్మ కాకపోతే ఓటు గురించి బేసిక్ ఐడియా లేని నువ్వు ఓ రాజకీయ…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేTS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుHyderabad Lok Sabha Election 2024: ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంపీ క్యాండిడేట్ సంచలనం.. నఖాబ్ ఓపెన్ చేసి చెక్ చేసిన మాధవీలత..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Janasena Party AP Elections Mangalagiri Print Out Casting Vote

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Read more »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
Read more »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటPawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Read more »

Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Read more »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »



Render Time: 2026-04-02 05:45:50