DR BR Ambedkar Jayanti Celebrations: కాంగ్రెస్ అంబేద్కర్ జయంతిని నిర్వహించడమంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందంటూ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.
DR BR Ambedkar Jayanti Celebrations: కాంగ్రెస్ అంబేద్కర్ జయంతిని నిర్వహించడమంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందంటూ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.Saturn Transit 2025: జులై 13 నుంచి శని ఈ రాశుల వారిపై వరాల జల్లు.
. మీరు బిగ్ జాక్పాట్ కొట్టబోతున్నారు! డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ‘‘కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాప పెట్టినట్లుగా ఉంది’’అని పేర్కొన్నారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్. ఆయనపై కుట్ర చేసి రెండుసార్లు ఓడించిందే కాంగ్రెస్. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయననను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసిందే కాంగ్రెస్. అట్లాంటి పార్టీ ఇయాళ అంబేద్కర్ జయంతిని పండుగలా నిర్వహించాలనడం సిగ్గుచేటు. తక్షణమే బడుగు, బలహీనవర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి’’అని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 120 దేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేయడమంటే ఆయన జీవిత చరిత్రను గుర్తు చేయడం, ఆయన బాటలో నడవడమే. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పతాక అంబేద్కర్. ఆయన జీవితం మనందరికీ స్పూర్దిదాయకం. ఒక్కపూట తింటూ ఉన్నత చదువు కోసం తన పదేళ్ల జీవితాన్ని బరోడా మహారాజ్ వద్ద ఫణంగా పెట్టి చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహోన్నతుడు అంబేద్కర్. అంబేద్కర్ భిక్షవల్లే ప్రధాని కాగలిగానని మోదీ అన్నారంటే వారి గొప్పతనం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జీ, పార్టీ ముఖ్య నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. బండి సంజయ్ ఏమన్నారంటే. "కాంగ్రెస్ అంబేద్కర్ జయంతిని నిర్వహించడమంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లుగా ఉంది. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ను రెండుసార్లు కుట్ర చేసి ఓడించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ను ఘోరంగా అవమానించిన డూప్లికేట్ గాంధీ కుటుంబమే ఇయాళ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పడం విడ్డూరం. శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఆలోచనా విధానాన్ని బలపర్చిన వ్యక్తి అంబేద్కర్. దేశ విభజనను, జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు బీజేపీ తూ.చ తప్పకుండా క్రుషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే... భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసింది. దళితుడైన రామ్ నాథ్ కోవింద్, ఆదివాసీ ముర్ముకు రాష్ట్రపతి పదవితో గౌరవించింది. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించింది. NCBC కు రాజ్యాంగ బద్ధత కల్పించింది. ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తోంది. బీజేపీ క్రుషితోనే అంబేద్కర్ కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చింది. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల. పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే. 2023లో నారీ శక్తి వందన్ బిల్లు ప్రవేశపెట్టడం... ఆర్టికల్ 370 రద్దు చేయడం బీజేపీ ఘనతే. అంబేద్కర్ స్పూర్తితో శక్తివంతమైన సమాజం కోసం అహర్నిశలు పాటుపడుతున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.." అని అన్నారు.Jr NTR angry at fans
CM Revanth Reddy Ambedkar Jayanti DR BR Ambedkar Jayanti Celebrations Ambedkar Jayanti News
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chameleon vs Pawan Kalyan: ఊసరవల్లి కంటే వేగంగా పవన్ కళ్యాణ్, ట్రెండ్ అవుతోన్న ఆ పదంAndhra Pradesh deputy Cm pawan kalyan facing Trolling on his comments to support hindi Chameleon vs Pawan Kalyan: పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ జయకేతనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో రెండు కీలకాంశాలున్నాయి.
Read more »
Aurangzebs Tomb Symbol Of Valour...: Shiv Sena-UBT MP Sanjay Raut Amid Demolition DemandNationalist Congress Party (Sharadchandra Pawar) or NCP (SP) MLA Rohit Pawar on Monday said that they are distracting people from real issues as the Mahayuti government has failed to address problems being faced by farmers and youth in Maharashtra.
Read more »
Sobhita Dhulipala: రోజూ రెండు గంటలు అదే పని...!.. చైతు గురించి షాకింగ్ విషయాలు బైటపెట్టిన శోభిత..Naga chaintanya and sobhita: శోభిత ధూళిపాళ తాజాగా ఇంటర్వ్యూలో తన భర్త గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ క్రమంలో ఈ జంట ప్రస్తుతం సమ్మర్ వెకెషన్ లో ఉన్నారు.
Read more »
Shalini Pandey: దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండేShalini Pandey Viral Comments: అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే సంచలన కామెంట్స్ చేశారు. ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమెకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
Read more »
Nidhi Agerwal: హీరోతో డేటింగ్.. ఆ పనిచేయోద్దని అగ్రిమెంట్.. బాంబు పేల్చిన హరిహర వీరమల్లు హీరోయిన్..!Nidhi agerwal on dating agreement: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read more »
Manchu Vishnu Wife: మంచు ఇంట్లో గొడవలు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు భార్య.. ఏమనిందంటే..?manchu vishnu wife viranika reddy: మంచు విష్ణు సతీమణి విరానికా రెడ్డి తన ఇంట్లో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవలపై తొలిసారి స్పందించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
Read more »
