Jagdeka veerudu athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కెరీర్ లోనే కాదు.. తెలుగు చలన చిత్ర సీమలో అత్యుత్తమ క్లాసికల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమా విడుదలైన ఈ నెల 9తో మ35 యేళ్లు పూర్తి కాబోతుంది.
Jagdeka veerudu athiloka sundari: చిరు 'జగదేకవీరుడు అతిలోక సుందరి' 3D ప్రింట్ కోసం ఈ రేంజ్ లో కష్టపడ్డారా. Jagdeka veerudu athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కెరీర్ లోనే కాదు. తెలుగు చలన చిత్ర సీమలో అత్యుత్తమ క్లాసికల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’.
Jagdeka veerudu athiloka sundari: చిరు 'జగదేకవీరుడు అతిలోక సుందరి' 3D ప్రింట్ కోసం ఈ రేంజ్ లో కష్టపడ్డారా.. Jagdeka veerudu athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కెరీర్ లోనే కాదు.. తెలుగు చలన చిత్ర సీమలో అత్యుత్తమ క్లాసికల్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. ఈ సినిమా విడుదలైన ఈ నెల 9తో మ35 యేళ్లు పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను 3D ఫార్మాట్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీల్ రిలీజైన ఈ చిత్రాన్ని 3Dలో రీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఎలాంటి ఏ రేంజ్ కష్టలో పడ్డారో ఓ వీడియో ను విడుదల చేశారు.తెలుగు చలన చిత్రసీమలో అతి పెద్ద సక్సెస్ సాధించిన అత్యుత్తమ క్లాసికల్ చిత్రాల్లో ఒకటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి'. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. కే.రాఘవేంద్రరావు అద్భుత దర్శకత్వం. అశ్వినీదత్ నిర్మాణ విలువలు. అతిలోకసుందిరిగా శ్రీదేవి నటన.. మహాద్రష్ఠగా అమ్రిష్ పురి విలనిజం వెరసి ఈ సినిమా పలు రికార్డులను తిరగరాసింది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అప్పట్లో ఈ సినిమా విడుదలైన సమయానికి పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను తట్టుకొని నిలబడి పలు కేంద్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకోవడం విశేషం. అయితే ఈ ఏడాది ఈ చిత్రం 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మాట్లలో విడుదల చేస్తుండటం విశేషం. ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ చిరంజీవితో నిర్మించిన తొలి చిత్రమిది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌కి ఒక గేమ్ చేంజర్. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మదిని దోచింది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామ్లీ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మూడేళ్ల పాటు ఎన్నో చోట్ల, ఎంత వెతికినా కూడా అసలైన నెగటివ్ దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ, ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 2018లో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' నెగటివ్ రీల్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి, చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకుంది చిత్రబృందం. అయితే కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ అయిపోయాయి. చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికిందని చిత్ర బృందం చెప్పింది. అదికూడా దుమ్ము దూళితో నిండిపోయి మసక బడిపోయిన స్థితిలో ఉంది. చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడి మళ్లీ దీన్ని పునరుద్ధరణ ప్రారంభిచారట. రీల్ ఎక్కడ ఎక్కడ కట్ అయిందో అక్కడ దానికి రిపేర్లు చేసి, ఎంతో కేర్ ఫుల్ గా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను పూర్తిగా రిమూవ్ చేశారు. తర్వాత ఈ చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడమే కాదు. దాన్ని 3డీలో మార్చి రిలీజ చేస్తున్నారు. అనేక ఏళ్ల శ్రమ, నిబద్ధతతో పునరుద్ధరించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్తగా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ఫార్మాట్లలో మే 9 నుంచి మళ్లీ టాకీస్లలలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి'సందడి చేయబోతుంది. సో మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు చూడటానికి రెడీ అయిపోండి. భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.India Suspended Imaran Khan Bilawal Bhutto
Jagdeka Veerudu Athiloka Sundari Chiranjeevi Sridevi Raghavendra Rao Ashwini Duth
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Smita Sabharwal: చిక్కుల్లో స్మిత సబర్వాల్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Hcu Kancha gachibowli Issue: సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఈ ఘటన ప్రస్తుతం పొలిటికల్స్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Read more »
Dormant Bank Account: బ్యాంకు అకౌంట్లను వాడటం లేదా..? అయితే భారీ నష్టం తప్పదు ఎందుకో తెలుసుకుందాంDormant Bank Account: సాధారణంగా చాలామంది తమకు తెలియకుండానే ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న పనుల కోసం చెక్కు డిపాజిట్ ల కోసం స్కాలర్షిప్ కోసం బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిని వాడకుండా వదిలేస్తుంటారు.
Read more »
Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవేPatanjali: యోగ గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని ఆయుర్వేద కంపెనీ పతంజలి తాజాగా గులాబీ షర్బత్ తో పాటు ఖస్, బెల్ షర్బత్ సరఫరాను కూడా పెంచింది. దేశంలో పెరుగుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణే దీనికున్న ప్రధాన కారణం.
Read more »
Tollywood Tier Heroes Pre Release business: నాని ‘హిట్ 3’ సహా టాలీవుడ్ టైర్ 2 హీరోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..Tollywood Tier Heroes Pre Release business: తెలుగులో టాప్ హీరోల తర్వాత నాని, విజయ్ దేవరకొండలు టైర్ 2 కథానాయకుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అంతేకాదు ఈ హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి.
Read more »
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా ట్రైన్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచంటే..?Hyderabad metro rail: చాలా మంది హైదరబాద్ లో తమ ప్రయాణాలకు మెట్రో ట్రైన్ లను ఎంచుకుంటారు.ఈ క్రమంలో ప్రతి ఐదునిమిషాలకు ఒక మెట్రోలను నగర వ్యాప్తంగా కనెక్టీవిటీ ఉండేలా ప్రత్యేకంగా ట్రైన్ లను ఏర్పాటు చేశారు.
Read more »
Pahalgam Terror Attack: పహల్గం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం.. ఆర్మీకి చిక్కిన ఇద్దరు టెర్రరిస్టు సహాయకులు..Jammu Kashmir Attack: పహల్గం ఉగ్రఘటన తర్వాత ఆర్మీ అధికారులు ఉగ్రవాదుల కోసం జమ్ముకశ్మీర్ అంతట జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఆర్మీ అధికారులు అరెస్ట్ చేశారు.
Read more »
