Coronavirus major threat in india, thousands of new active cases registered Coronavirus Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు ఇండియాను భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ తరువాత దేశంలో కలవరం రేపుతోంది.
Coronavirus Threat: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 4 వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lakshmi Narayana Yogam: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికీ కలలో సైతం ఊహించని డబ్బు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ.. Coronavirus Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పుడు ఇండియాను భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ తరువాత దేశంలో కలవరం రేపుతోంది. జూన్ 1 నాటికి దేశంలో 4 వేల కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అలర్ట్ జారీ చేశాయి. కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నఅంటే జూన్ 1 నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 3985 నమోదయ్యాయి. మే 22 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 260 కేసులుంటే కేవలం నాలుగు రోజుల్లో అంటే మే 26 నాటికి 1100 కు చేరుకుంది. అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 1200 శాతం పెరుగుదల కన్పించడం ఆందోళన కల్గిస్తోంది. కరోనా కేసుల పెరుగుదల, వ్యాప్తి నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక అలర్ట్ జారీ చేశాయి. ప్రజల్ని మరోసారి కోవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందిగా సూచించాయి. వైద్యాధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించడం చేయాలని అంటున్నాయి. అదే సమయంలో వృద్ధులు, గర్భిణీలు ఇళ్లలోనే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ జారీ చేశాయి. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు కేరళలో నమోదవుతున్నాయి. ఆ తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. కేరళలో 189 కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1336 ఉంది. మహారాష్ట్రలో 467 యాక్టివ్ కేసులుంటే ఢిలీలో 375 కేసులు, గుజరాత్ లో 265 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 235 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 205, తమిళనాడులో 185, ఉత్తర ప్రదేశ్ లో 117 కేసులు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్ లో 60, పుదుచ్చేరిలో 41, హర్యానాలో 26, ఏపీలో 1, ఎంపీలో 16 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ కేసులు గత 24 గంటల్లో 700 నమోదు కాగా నలుగురు మరణించారు. గత ఏడాది అంటే 2024లో కోవిడ్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ భారతదేశం, పశ్చిమ ప్రాంతాల్లో సేకరించిన కరోనా వైరస్ నమూనాల ప్రకారం కొత్త వేరియంట్లు బయటపడినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించేటప్పుడు మాస్క్ తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు. శానిటైజర్ తప్పకుండా వాడాలని హెచ్చరిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Miss World 2025: నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే, లైవ్ ఎప్పుడు ఎందులో, ఫైనలిస్టు రేసులో 16 మందిRajiv Yuva Vikasam SchemeSnake Eats Tomatoes Viral Video: టమాటోలు తింటున్న అతి విషపూరితమైన పాము.. వీడియో చూస్తే ఈ జన్మలో వాటిని తినరు..Rajiv Yuva Vikasam: రేపటి నుంచే 'రాజీవ్ యువ వికాసం' అమలు.. ఎవరు అర్హులు? ఈ పథకం లాభాలు ఏంటి?
Coronavirus Corona New Cases In India Coronavirus Threat In India Corona Cases Increase In India
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Covid Threat: మళ్లీ పంజా విసురుతున్న కరోనా, సింగపూర్, హాంకాంగ్‌లో భారీగా కేసులుCoronavirus hits again new cases increasing in Singapore and Hongkong మాయమైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
Read more »
Coronavirus: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి, కేసుల తీవ్రత ఎలా ఉందిCoronavirus Cases and Severity in India check the coronavirus new variant Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ వైరస్ మరోసారి భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి.
Read more »
Coronavirus: ఏపీలో కొత్తగా కరోనా కేసులు, కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంCoronavirus Pandemic Updates New Covid Sub Variant Cases registered and ap government Coronavirus: కరోనా మహమ్మారి మళ్లీ వెలుగు చూసింది. అంతా సమసి పోయిందనుకున్న తరుణంలో సింగపూర్, హాంకాంగ్ తరువాత ఇప్పుడు ఇండియాలో కూడా కొత్త వేరియంట్ వెలుగుచూసింది
Read more »
Covid 19 Cases: దేశంలో మరోసారి పెట్రేగిపోయిన కోవిడ్.. వెయ్యిదాటిన యాక్టివ్ కేసులు.. కేంద్రం హైఅలర్ట్..Corona virus cases update: దేశంలో మరోసారి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా పెరగటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది.
Read more »
Coronavirus Threat: దేశంలో కరోనా వైరస్ భయం, భారీగా పెరుగుతున్న కేసులు, ఇద్దరి మృతిCoronavirus threat in india, increase in new positive Cases two reported dead కోవిడ్ 19 కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి
Read more »
Covid19 Alert: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రత్యేక అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వంAndhra Pradesh Government issues special covid19 Alert and guidelines రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అలర్ట్ ప్రకటించింది ముఖ్యంగా కొందరు ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది
Read more »
