Telangana Governor: తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Telangana Governor : తెలంగాణ గవర్నర్ గా తమిళ సై రాజీనామా చేసినప్పటి నుంచి జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి ఇంఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది.
తాజాగా కేంద్రం మరో కీలక వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్టు సమాచారం.Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని : 2024 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్టీయే సర్కారు ఢిల్లీలో కొలువు తీరింది. ప్రధాన మంత్రితో పాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. అందులో 30 మంది క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మరికొంత మంది స్వతంత్య్ర హోదాతో పాటు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల గవర్నల్లు లోక్ సభకు పోటీ చేసారు. అందులో తెలంగాణ గవర్నర్ తమిళ సై తమిళనాడులోని చెన్నై సౌత్ నుంచి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఇవన్నీ కొలిక్కి వచ్చే లోపు జూలై 1 లోగా ఇంచార్జ్ గవర్నర్ లుగా ఉన్న స్థానాల్లో కొత్తవారికి నియమించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ గా ముందుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల ముందు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతేకాదు ఈయన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి సీఎంగా పనిచేయడంతో పాటు ఇక్కడ పుట్టి పెరిగారు. అంతేకాదు ఇక్కడ ప్రాంతంపై పూర్తి పట్టుంది. అందుకే ఆయన్ని నియమించాలని ముందుగా అనుకున్నారు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డిని కర్ణాటక గవర్నర్ గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బిహార్ కు చెంది ప్రముఖ నేత మోడీకి అత్యంత సన్నిహితుడుగా పేరున్న అశ్విని కుమార్ చౌబే ను తెలంగాణ గవర్నర్ గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈయన రామ మందిరం నిర్మాణంలో కూడా కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు మోడీ గత క్యాబినేట్ లో సహాయ మంత్రిగా పనిచేసారు. 1953లో జన్మించిన ఈయనకు ఆర్ఎస్ఎస్ తో మంచి అనుబంధమే ఉంది. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీకి తమకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిని గవర్నర్ గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 8 పార్లమెంట్ స్థానాలు గెలవడంతో గెలుపుపై నమ్మకం ఏర్పడింది. అందుకే బీజేపీ పెద్దలు కట్టర్ హిందువుగా పేరున్న అశ్వినీ కుమార్ చౌబే ను తెలంగాణ గవర్నర్ గా నియమించి రాజకీయంగా ఇక్కడ పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉంది. మరి బీజేపీ పెద్దలు వ్యూహాలు తెలంగాణలో ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Sidda Raghava Rao
Ashwini Kumar Choubey Nallari Kiran Kumar Reddy BJP Telangana Telangana Politics
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
Read more »
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
Read more »
BRS KCR: గొప్ప మనసు చాటుకున్న గులాబీ బాస్.. కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డకు 24 లక్షల రూపాయల చెక్కు..TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.
Read more »
Telangana BJP chief Etela: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా ఈటల రాజేందర్..?Telangana BJP chief Etela: నేడు జరగబోయే కేంద్ర క్యాబినేట్ లో మల్కాజ్ గిరి నుంచి లోక్ సభకు ఎన్నికైన ఈటలకు స్థానం దక్కుతుందని అందరు భావించారు. అనూహ్యంగా ఈటలకు మంత్రి పదవి కాకుండా.. తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
Read more »
TGRTC Md Sajjanar: సీరియస్ అయిన సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు రూమర్స్ విషయంలో క్లారిటీ..RTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచినట్లు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై స్పందించారు.
Read more »
Kiran kumar Reddy: తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ?Kiran kumar Reddy: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించనుందా ? అంతేకాదు త్వరలోనే ఆయనకు తెలంగాణ గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read more »
