Gold Price in Hyderabad : బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71000 దాటింది. శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో పసిడి ప్రియులు జోరున షాపింగ్ చేస్తున్నారు.
Gold Price in Hyderabad : బంగారం ధరలు ఆగస్టు 6 మంగళవారం కూడా పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. పసిడి ధర ఈరోజు కూడా భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71000 దాటింది. శ్రావణమాసం కూడా ప్రారంభం కావడంతో పసిడి ప్రియులు జోరున షాపింగ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.Gold Price in Hyderabad : అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతుందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించి బంగారం వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి ఒకసారిగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా దేశీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాదులో 71,093 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,122 రూపాయలుగా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోల్చి చూసినట్లయితే స్వల్పంగా పెరిగింది అని చెప్పవచ్చు. బంగారం ధరలు అందరూ ఊహించినట్లుగానే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 71 వేల రూపాయలు దాటింది. అయితే సరిగ్గా గత నెల చివరి వారంలో బడ్జెట్ సందర్భంగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఏకంగా ఒకేరోజు 4000 రూపాయలు తగ్గింది. కానీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు మళ్ళీ రికవరీ బాట పట్టాయి. దిగుమతి సుంకం పై పన్ను తగ్గించినప్పటికీ బంగారం ధరలు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర ఏకంగా 10 గ్రాములకు గాను 4వేల రూపాయలు పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర మళ్లీ చారిత్రక గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయలను తాకడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు.బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అమెరికా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పాటు ఆసియా మార్కెట్లలో కూడా భారీ పతనం నమోదు అవుతోంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వు ఇటీవల విడుదల చేసిన కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా బాండ్ మార్కెట్లో యూఎస్ ట్రెజరీ బాండ్ల యీల్డ్ తగ్గింది. దీంతో చాలామంది పెట్టుబడిదారులు బాండ్ మార్కెట్ కన్నా బంగారంలోనే పెట్టుబడి పెడితే లాభదాయకమని భావిస్తున్నారు.పెట్టుబడి పరంగా చూస్తే సురక్షిత పెట్టుబడి సాధనం బంగారమే అని మదుపుదారులు అటువైపుగా తమ పెట్టుబడులన్నింటినీ తరలిస్తున్నారు.
Today Silver Rate Gold Rate Today Today Gold Rate Silver Price Today Today Silver Rates
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Price Today: ఆ మురిపమూ మూడు రోజుల ముచ్చటే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Silver Price Today:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకానొక సమయంలో రూ. 80వేల మార్కును దాటిన తులం బంగారం మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చింది. గత తొమ్మిది రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగి షాకిచ్చింది.
Read more »
Gold Rate: తులం బంగారం ధర అక్షరాలా రూ.2.50 లక్షలు.. ఎక్కడో తెలుసా.?Gold Price: ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతూ ఉంటే మరోవైపు పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
Read more »
Today Gold Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్...బంగారం మళ్లీ పెరిగే చాన్స్..కారణాలు ఇవే..!!Gold Price Today: బంగారం ధరలు ప్రస్తుతం భారీగా పతనం అవుతున్నాయి.అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక మద్యలోనే ఆగిపోతుందా? బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా లేదా అనే సందేహాలు పసిడి ప్రియుల్లో నెలకొని ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరల కదలిక ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Read more »
Gold-Silver Rate Today: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నెమ్మదిగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారంతోపాటు వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Read more »
Gold Rate: రెండు రోజుల్లో రూ.3వేలు పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో పసిడి ప్రియులకు చేదు వార్తేనా?Gold Rate Today August 2nd, 2024: బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం ప్రారంభించాయి.దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. బంగారం ధరలు ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. గడిచిన 48 గంటల్లో బంగారం ధరలు ఏకంగా 1000 రూపాయలు పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు.
Read more »
Gold-Silver Rate Today: పెరుగుతూనే ఉన్న బంగారం ధర..నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగిందో తెలుసుకోండి..!!Gold Price in Hyderabad: బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులు పసిడి ధరలు పెరుగుతున్నాయి. నేడు సోమవారం బంగారం ధరల్లో మార్పు కనిపించింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read more »
